Notifications :
TSPSC GROUPS SYLLABUS AND DETAILS
-గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల భర్తీ , సిలబస్‌పై జీవో జారీ-టీఎస్‌పీఎస్సీ పరిధిలోని ఉద్యోగాల భర్తీపై స్పష్టత
-తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం
-భావి ఉద్యోగుల అవగాహన పరీక్షించడమే అసలు ఉద్దేశం
-కొత్త పరీక్షా విధానంపై సర్వత్రా హర్షం
రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొలువుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. తెలంగాణలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన గ్రూప్-3 పోస్టులను, వాటి ఎంపిక విధానాన్ని సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 330ని విడుదల చేసింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్, ఎంపిక విధానాన్ని సూచించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పోస్టుల భర్తీ విషయంలో అనుసరించాల్సిన ఎంపిక విధానం, కొత్త సిలబస్‌పై ఆ కమిటీ తన నివేదికను టీఎస్‌పీఎస్సీకి అందజేసింది.
అనుమతికోసం టీఎస్‌పీఎస్సీ ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేయగా.. నిపుణుల కమిటీ నివేదికను సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదనలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానానికి సంబంధించిన ఖాళీలు, పరీక్షా ప్రణాళిక, విధానంపై టీఎస్‌పీఎస్సీకి మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సిలబస్, ఎంపిక విధానంపై తెలంగాణవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని స్థాయిల సిలబస్‌లోనూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక, సామాజిక అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సమైక్య పాలకుల హయాంలో అణచివేతకు గురైన తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భౌగోళిక, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయుక్తం అవుతుందని భావిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అధికారులకు తెలంగాణపై స్పష్టమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు ఉద్యోగార్థులు కూడా ఇప్పటికే తమ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయబోయే వివిధ క్యాటగిరీ కొలువుల పరీక్షా ప్రణాళిక, విధానం పూర్తి వివరాలు
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయబోయే వివిధ క్యాటగిరీ కొలువుల పరీక్షా ప్రణాళిక, విధానం
గ్రూప్-1 ఉద్యోగాలు 1. డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)2. డిప్యూటీ సూపరింటిటెండ్ ఆఫ్
పోలీస్-కేటగిరీ-2 (పోలీస్ శాఖ)
3. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (వాణిజ్య పన్నుల శాఖ)
4. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (రవాణాశాఖ)
5. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (కోఆపరేటివ్ సర్వీస్)
6. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ (పంచాయతీ సర్వీస్)
7. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్)
8. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఫైర్ సర్వీస్)
9. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుష), (జైళ్ల శాఖ)
10. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్)
11. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్)
12. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2
(మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
13. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (సోషల్ వెల్ఫేర్ సర్వీస్)
14. డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సర్వీస్)
15. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్)
16. డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఎంప్లాయిమెంట్ సర్వీస్)
17. లే సెక్రటరీ, ట్రెజరర్ గ్రేడ్-2 (మెడికల్, హెల్త్ సర్వీస్)
18. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్)
19. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్)
20. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
(పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్)
Call Center
Telangana State Public Service CommissionFor any Notification related issues
Please Call Ph:040 24655555 / 24606666
(Call Time :10.30 A.M to 5:00 P.M on working days)
SBIePay
For any queries in Payment GatewayCall Phone Number: 022-2752 3796
Technical Team
For any doubts in Online submission and download of hall-ticketsCall Ph: +91 40 23120301 / 23120302
(Call Time :10.30 A.M to 5:00 P.M on working days)
Postal Address
Secretary,Telangana State Public Service Commission, Prathibha Bhavan, M.J.Road,
Nampally, Hyderabad - 500103.
Telephone No: 040-24747577
Fax. No: 040-24747578
0 comments:
Post a Comment